ప్రముఖ టెక్ బ్రాండ్ Apple త్వరలో ఒక కొత్త SE సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నారు. ఈలోపు, iPhone SE 4 కి సంబంధించి ఒక అప్డేట్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా iPhone SE 4 యొక్క ప్రధాన ఫీచర్లు, ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
iPhone SE 4 వివరాలు (లీక్)
Based on what has been reported to me, the iPhone SE could have a design very similar to that of the current iPhone 16 still in development. The new iPhone SE will most likely have a single camera instead of the double one of the iPhone 16 models, otherwise it seems that the… pic.twitter.com/Z1Gio4nBRu
— Majin Bu (@MajinBuOfficial) February 8, 2024
- కొత్త లీక్ ని టిప్‌స్టర్ @MajinBuOfficial తన X ఖాతా ద్వారా షేర్ చేశారు.
- టిప్‌స్టర్ iPhone SE 4 యొక్క డిజైన్ రెండర్ షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ విభిన్నంగా కనిపిస్తోంది.
- iPhone SE 4 చూడటానికి iPhone X మాదిరి కనిపిస్తున్నట్లు టిప్‌స్టర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
- iPhone SE 4 లో డైనమిక్ ఐల్యాండ్ కూడా కనిపిస్తోంది.
- iPhone SE 4 బ్యాక్ ప్యానెల్ పై సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్
iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్ లో మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. కానీ, లీక్స్ ప్రకారం ఈ డివైజ్ 2024 లేదా వచ్చే ఏడాది 2025 లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఆపిల్ నుంచి రావొచ్చు.
iPhone SE 4 స్పెసిఫికేషన్స్ (లీక్)
- iPhone SE 4 డివైజ్ ఈమధ్య వచ్చిన కొత్త ఐఫోన్ల మాదిరి డిస్ప్లే డిజైన్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వచ్చే ఛాన్స్ ఉంది.
- iPhone SE 4 లో టచ్ ఐడీని ఆపిల్ తీసేయడంతో, ఈ కొత్త iPhone SE 4 ఫోన్ ఫేస్ ఐడీ తో రానుంది.
- iPhone SE 4 లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, డైనమిక్ ఐల్యాండ్ సపోర్ట్ తో రానుంది.
- iPhone SE 4 లో 48ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
- iPhone SE 4 ఫోన్ ఏ17 బయోనిక్ చిప్ తో రానుంది.
- iPhone SE 4 లో పవర్ బ్యాకప్ కోసం 3,279 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
- iPhone SE 4 యూఎస్బీ-సీ పోర్ట్ తో రానుంది. iPhone SE 4 లో యాక్షన్ బటన్ కూడా కనిపిస్తోంది.
