ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.
iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు
iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ V59 అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇది ఆపిల్ నుంచి వస్తోన్న ఎంట్రీ లెవెల్ ఐఫోన్.
ఈసారి వస్తోన్న iPhone SE 4 లో చాలా కాలంగా అందరికీ సుపరిచితమైన హోమ్ బటన్ డిజైన్‌ను ఆపిల్ తీసివేయనుంది. iPhone SE 4 లో ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్ ఉంటుంది.
ఇక ఎప్పటిలాగే, iPhone SE 4 లో 40ఎంపి 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ కెమెరా, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.
ఆపిల్ యొక్క సొంత 5జీ మోడెమ్‌తో వస్తోన్న మొట్టమొదటి ఐఫోన్, iPhone SE 4 కావడం విశేషం. ఈ వైర్లెస్ మోడెమ్ కోడ్ నేమ్‌ను సెంటారి అని పెట్టారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కు సపోర్ట్ ఉంటుంది. ఆపిల్ మోడెమ్ వల్లన ఐఫోన్లు తక్కువ బ్యాటరీ పవర్ వాడుకుంటాయి. హార్డ్‌వేర్‌తో బెటర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. iPhone SE 4 డివైజ్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుండటం మరొక బిగ్ ప్లస్ పాయింట్.
iPhone SE 4 స్పెసిఫికేషన్స్
iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1170*2532 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఏ18 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, 5-కోర్ జీపీయూ వంటి ఫీచర్లతో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇదే 5-కోర్ జీపీయూని ఐఫోన్ 16 సిరీస్ లో కూడా వాడారు.
iPhone SE 4 ధర
iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. అయితే గత ఎస్ఈ మోడల్ కంటే ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం అంతా కూడా లీక్స్ ద్వారా తెలిసినవే. త్వరలోనే అఫీషియల్ గా ఏదైనా ప్రకటన రావొచ్చు. లేదంటే మరిన్ని లీక్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
