Home News లీకైన iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్

లీకైన iPhone SE 4 లాంచ్ టైమ్‌లైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్

Highlights
  • 2024 లో iPhone SE 4 ని ఆపిల్ సంస్థ లాంచ్ చేయనుందని వినిపిస్తోన్న రూమర్లు
  • 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో రానున్న iPhone SE 4 డివైజ్
  • ఓఎల్ఈడీ ప్యానెల్ ధర 40 డాలర్లు గా ఉందని సమాచారం, ప్యానెల్ ని సప్లై చేస్తోన్న BOE సంస్థ

కొన్ని రోజుల నుంచి iPhone SE 4 లాంచ్ కి సంబంధించిన రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ డివైజ్ వచ్చే ఏడాది లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే నెట్టింట్లో లీక్స్ తుపాను మొదలైంది. తాజాగా వచ్చిన ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం, అప్‌కమింగ్ iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ప్యానెల్ ని BOE సంస్థ తయారు చేసింది.

iPhone 15 లైనప్ లో వాడుతోన్న ఓఎల్ఈడీ ప్యానెల్ పోల్చితే తక్కువ ధర కలిగిన ఓఎల్ఈడీ ప్యానెల్ ని iPhone SE 4 లో వాడనున్నట్లు సమాచారం. దీంతో ధరను తగ్గించే వీలుంటుందని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లీకైన iPhone SE 4 డిస్ప్లే వివరాలు

The Elec కథనం ప్రకారం, అప్‌కమింగ్ iPhone SE 4 డివైజ్ 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తోంది. ఈ ప్యానెల్ ని BOE సంస్థ తయారు చేసినట్లు సమాచారం. ఆపిల్ తీసుకున్న నిర్ణయం తేలిగ్గా అర్థమయ్యేదే. BOE సప్లై చేసే OLED ప్యానెల్ ధర దాదాపు 40 డాలర్లు ఉండనుంది. అప్‌కమింగ్ iPhone 15 మోడల్స్ మరియు iPad models లో వాడే ఓఎల్ఈడీ డిస్ప్లే (శాంసంగ్/ఎల్‌జి డిస్ప్లే) ధర దాదాపు 100 డాలర్లు ఉంటుంది.

ఆపిల్ తన తాజా నిర్ణయంతో iPhone SE 4 ధరను అందుబాటులోనే ఉంచే అవకాశం ఉంది. iPhone SE 4 డివైజ్ iPhone 14 బాడీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. కంపోనెంట్స్ తో పాటు, కొన్ని స్పెసిఫికేషన్స్ కూడ iPhone 14 ని పోలి ఉంటాయని తెలుస్తోంది.

iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తోన్న మొట్టమొదటి iPhone SE డివైజ్ గా నిలవనుంది. iPhone SE 4 ఫోన్ 6.1-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లే, 60 హెర్ట్జ్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. మరోవైపు iPhone 15 సిరీస్ డివైజెస్, ఆపిల్ యొక్క ProMotion 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే లను కలిగి ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.