Home News 6.1-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్న నెక్ట్స్ జనరేషన్ iPhone SE; 2024 లో లాంచ్ అయ్యే అవకాశం

6.1-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్న నెక్ట్స్ జనరేషన్ iPhone SE; 2024 లో లాంచ్ అయ్యే అవకాశం

హైలైట్స్:

MacRumors తన తాజా కథనంలో, iPhone SE గురించి డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెన్ట్స్ అనలిస్ట్ రాస్ యంగ్ తెలిపిన వివరాలను ప్రచురించింది. అనలిస్ట్ రాస్ యంగ్ చెబుతున్న దాన్ని బట్టి, iPhone SE 6.1-అంగుళాల ఎల్సీడీ ప్యానెల్, నాచ్ తో రానుంది. ఆపిల్ ప్రొడక్ట్స్ గురించి సరైన సమాచారాన్ని తెలిపిన సక్సెస్ఫుల్ రికార్డ్ రాస్ యంగ్ కి ఉంది. 2024 లో లాంచ్ అయ్యే ఐఫోన్ ఎస్ఈ మోడల్ 5.7-ఇంచ్ నుంచి 6.1-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్ ని కలిగి ఉండనుందని, గతంలో రాస్ యంగ్ తెలిపాడు. అలాగే హోల్-షేప్డ్ కటౌట్ కూడా ఉంటుందని అతను అన్నాడు.

అప్పుడు రాస్ యంగ్, హోల్-షేప్డ్ కౌటౌట్ గురించి చెప్పినది, డైనమిక్ ఐల్యాండ్ ని ఉద్దేశించి అయి ఉంటుందని అనుకోవచ్చు. అయితే, తన క్లెయిమ్ ని రివైజ్ చేసిన యంగ్, నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ 6.1-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, నాచ్ తో వస్తుందని చెప్పాడు. iPhone SE లో ఫేస్ ఐడీ కోసం ట్రూడెప్త్ కెమెరా ఉంటుందో లేదోనన్న విషయాన్ని తాజా నివేదిక స్పష్టం చేయలేదు.

Touch ID కలిగిన iPhone XR ఫోనే 2024 లో లాంచ్ అయ్యే iPhone SE?

iPhone SE నాచ్ డిస్ప్లే తో పాటు, టచ్ ఐడీ తో వస్తుందని ఇంటర్నెట్ లో టాక్ వినిపిస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు, కస్టమర్ల ఆసక్తిని రెట్టింపు చేసేందుకే టచ్ ఐడీ ని కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రాబోవు iPhone SE నాచ్ డిస్ప్లే తో వస్తుందంటే సంప్రదాయ టచ్ ఐడీకి గుడ్ బై చెప్పినట్లేనా? అంటే కాదనే అంటున్నారు. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ ల్లో మాదిరిగా టచ్ ఐడీని నిక్షిప్తం చేయనున్నారని సమాచారం.

2024 లో లాంచ్ కాబోవు iPhone 15 మోడల్స్ కూడా డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ తో రానున్నట్లు రాస్ యంగ్ చెప్పాడు. రాస్ యంగ్ చెబుతున్నట్లు iPhone SE లో ఎల్సీడీ నాచ్ డిస్ప్లే, iPhone 15 లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్.. నిజమైతే కనుక 2024 రాబోయే ఒకే ఒక ఎల్సీడీ నాచ్ డిస్ప్లే ఫోన్ గా iPhone SE నిలవనుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ బాడీతో ఐఫోన్ ఎస్ఈ రానుందని ఇది వరకు వచ్చిన పలు కథనాల ద్వారా తెలిసింది. విషయమేంటంటే, ఐఫోన్ ఎక్స్ఆర్ కూడా 6.1-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ని కలిగి ఉంది. దీంతో రాబోవు ఐఫోన్ ఎస్ఈ కూడా ఇదే సైజు డిస్ప్లే తో వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.