హైలైట్స్
- డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్
- భారత్ లో 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీ తో వస్తోన్న iQOO 11 5G
iQOO 11 లాంచ్ ఈవెంట్ సమీపిస్తోంది. డిసెంబర్ 2 న చైనా మరియు మలేషియాల్లో ఈ కొత్త ఫ్లాగ్షిప్ అన్‌వీల్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. iQOO 11 5G తో పాటు, iQOO Neo 7 SE 5G లాంచ్ అవుతుంది. ఇక iQOO 11 Pro 5G కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఐకూ 10 5జీ ఫోన్ కి సక్సెసర్ గా iQOO 11 5G వస్తోంది. ఈ డివైజ్ డిసెంబర్ 2 న చైనాలో లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు కంపెనీ iQOO 11 5G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది. ఐకూ ఇదివరకే చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ టెక్నాలజీ వివరాలను వెల్లడించింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది.
iQOO 11 5G స్పెసిఫికేషన్స్
iQOO 11 5G బేస్ మోడల్ అయితే 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 3.1 యూఎఫ్ఎస్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా బయటకు వచ్చిన టీజర్ ద్వారా iQOO 11 5G యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
iQOO 11 5G 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ6 అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోంది. ఇది 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. డిస్ప్లే వివరాలు ఐకూ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
తాజాగా బయటకు వచ్చిన టీజర్ ఇమేజెస్ లో లెజెండ్ కలర్ ఆప్షన్, వైట్ రియర్ ప్యానెల్ పై మూడు కలర్ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి. మరొక లీక్ లో ఆల్ఫా కలర్ ఆప్షన్ కూడా కనిపిస్తోంది.
iQOO 11 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఐకూ 10 మాదిరి చార్జింగ్ స్పీడ్ ని ఈ ఫోన్ కి కూడా అందించింది. కానీ, బ్యాటరీ కెపాసిటీని మాత్రం 300ఎంఏహెచ్ పెంచింది. iQOO 11 5G లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో వీ2 చిప్ ఉంటుంది. ఇది వివో అభివృద్ధి పరిచిన కస్టమ్ ఐఎస్పీ. లో-లైట్ వీడియో రికార్డింగ్ మరియు పొట్రెయిట్ మోడ్ సామర్థ్యాలను మెరుగుపరిచిచేందుకు ఈ చిప్ ఉపయోగపడుతుంది.
iQOO 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO 11 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
iQOO 11 5G భారత్ మరియు ఇతర మార్కెట్స్ లో 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.