Home News జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్

జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్

హైలైట్స్

ఐకూ సంస్థ నిన్న ఎన్నో అంచనాల మధ్య iQOO 11 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం జనాలు ఎంతగానో ఎదురు చూశారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో iQOO 11 మార్కెట్ లోకి వచ్చింది.

iQOO 11 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. 256జిబి స్టోరేజీ కెపాసిటీ తో ఈ ఫోన్ వచ్చింది. జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్ లభించనుంది. సరే, ఓసారి iQOO 11 యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో iQOO 11 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

iQOO 11 స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 256జిబి వేరియంట్ మరియు 16జిబి + 256జిబి వేరియంట్. 8జిబి ర్యామ్ వేరియంట్ ఆల్ఫా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీని ధర రూ.59,999. ఇక 16జిబి ర్యామ్ లెజెండ్ వేరియంట్ ధర రూ.64,999.

లాంచ్ ఆఫర్ క్రింద, హెచ్డీఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ కార్డ్ ట్రాన్స్‌సాక్షన్స్ పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 లభిస్తుంది. అలాగే మీరు వాడుతోన్న ఐకూ ఫోన్ ని మారిస్తే అదనంగా రూ.1,000 ఎక్స్‌చేంజ్ బోనస్ వస్తుంది.

జనవరి 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు ఐకూ స్టోర్స్ ద్వారా iQOO 11 ని కొనుగోలు చేయవచ్చు. ఇక ప్రైమ్ మెంబర్స్ కి జనవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది.

iQOO 11 స్పెసిఫికేషన్స్

iQOO 11 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ6 ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ (3200*1440 పిక్సెల్స్) రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. హెచ్డీఆర్10+ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

iQOO 11 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ వాడారు. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో వచ్చింది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఇందులో వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 కి చేరేందుకు ఈ ఫోన్ 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

ఇన్ఫ్రారెడ్ సెన్సర్, హై-ఫై ఆడియో, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ ఆడియో, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్/గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు iQOO 11 లో ఉన్నాయి.

iQOO 11 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ శాంసంగ్ జీఎన్5 సెన్సర్, ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.