హైలైట్స్
- 2023 జనవరిలో iQOO 11 భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా
- డిసెంబర్ 8 న చైనాలో లాంచ్ కానున్న iQOO 11, కన్ఫర్మ్ చేసిన కంపెనీ
- లాంచ్ కి ముందు లీకైన స్పెసిఫికేషన్స్, ధర. 16జిబి ర్యామ్ తో వస్తున్న iQOO 11
iQOO 11 సిరీస్ డిసెంబర్ 8 న లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనా మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్ లో ఇదే తేదీన లాంచ్ అవుతాయని కంపెనీ ఖరారు చేసింది. ఇక ఇతర మార్కెట్స్ లో కూడా iQOO 11, iQOO 11 Pro లాంచ్ కానున్నాయి. తాజాగా ఐకూ థాయిలాండ్ అధికార వెబ్ సైట్ లో లాంచ్ వివరాలు పొందుపరిచారు. దీంతో iQOO 11 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
లిస్టింగ్ ద్వారా iQOO 11 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన iQOO ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ 12జిబి ర్యామ్ వరకు సపోర్ట్ చేశాయి. సరే, ఓసారి iQOO 11 ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ కాబడిన iQOO 11
iQOO 11 వివిధ మార్కెట్స్ లో విభిన్న స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. థాయిలాండ్ లో ఈ డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ కానుందని సమాచారం. థాయిలాండ్ లో ఈ ఫోన్ ధర THB 29,990 (సుమారు రూ.70,600) గా ఉంది. ఇంకా 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు. iQOO 11 సిరీస్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తుందని ఇప్పటికే కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే, బేస్ మోడల్స్ మాత్రం ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానున్నాయి.
TechGoing అనే వెబ్‌సైట్ గుర్తించిన లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో చూద్దాం. iQOO 11 లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్ (1440*3200 పిక్సెల్స్), 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇక పలు ఇమేజెస్ ద్వారా ఫోన్ యొక్క ముందు భాగం ఎలా ఉందో తెలుస్తోంది. డిస్ప్లే సన్నని బెజెల్స్ ని కలిగి ఉంది. పైన మధ్యలో సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంది.
iQOO 11 యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి 2ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం iQOO 11 లో 16ఎంపి కెమెరా ఉంటుంది.
iQOO 11 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. iQOO 11 లెజెండ్ మరియు ఆల్ఫా కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. చైనీస్ వేరియంట్ మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iQOO 11 గ్లోబల్ వేరియంట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.