హైలైట్స్
- నెట్టింట్లో ప్రత్యక్షమైన iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న iQOO 11 Pro
- 2023 ఆరంభంలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 11 Pro
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో iQOO 11 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయబోతోంది. iQOO 11 సిరీస్ లైనప్ లో స్టాండర్డ్ iQOO 11 మరియు iQOO 11 Pro వేరియంట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కంపెనీ నుంచి iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ ద్వారా iQOO 11 Pro యొక్క లాంచ్ టైమ్ లైన్ మరియు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ గురించి తెలిసింది. పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్
GSMArena కథనం ప్రకారం, iQOO 11 Pro 2023 జనవరి లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన కచ్చితమైన తేదీ ఇంకా తెలియలేదు. ఐకూ బ్రాండ్ ఇప్పటికే లాంచ్ తేదీని నిర్ణయించి ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే లాంచ్ కి ఇంకా కొన్ని వారాల గడువే ఉంది.
iQOO 11 Pro స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
లీకైన సమాచారాన్ని బట్టి iQOO 11 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ వివో సొంతంగా అభివృద్ధి పరిచిన V2 ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ తో వస్తోంది. ఈ విషయం ఇటీవలె స్పష్టమైంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, iQOO 11 Pro 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉండనుంది.
ఇప్పుడు iQOO 11 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO 11 Pro లో 50ఎంపి + 50ఎంపి + 48ఎంపి + 64ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇందులో ఉండనుంది. iQOO 11 Pro లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అదే భారత్ లో అయితే ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. బీఎండబ్ల్యూ ఎమ్ మోటార్‌స్పోర్ట్ ఇన్‌స్పైర్డ్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.
iQOO 11 Pro డివైజ్ లో 2కే రెజుల్యూషన్ డిస్ప్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ తో ఈ ఫోన్ రానుందని సమాచారం. 512జిబి స్టోరేజీ యూనిట్ ని ఐకూ చైనాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్ భారత్ కి వచ్చే చాన్సెస్ తక్కువే.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.