Home News Snapdragon 8 Gen 2 చిప్సెట్, 200W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO 11 Pro

Snapdragon 8 Gen 2 చిప్సెట్, 200W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO 11 Pro

హైలైట్స్

తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాతో పాటు భారత్ లో కూడా ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ లాంచ్ అవ్వనుందని సమాచారం. గతంలో ఐకూ 10 సిరీస్ ని చైనాకు మాత్రమే పరిమితం చేసిన ఐకూ, భారత్ లో ఐకూ 9టీ ని లాంచ్ చేసింది. ఇది వన్‌ప్లస్ 10టీ 5జీ డివైజ్ కి పోటీగా వచ్చింది. అయితే ఈసారి iQOO 11 సిరీస్ ని భారత్ కి కూడా తీసుకురావాలని ఐకూ ప్లాన్ చేస్తోంది.

ఇదివరకు వచ్చిన రిపోర్ట్ ద్వారా iQOO 11 Pro మోడల్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు ప్రముక టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ iQOO 11 Pro స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. అయితే లేటెస్ట్ లీక్ కి గతంలో వచ్చిన రిపోర్ట్స్ కి తేడా ఉంది. సరే, తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO 11 Pro పూర్తి స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇదివరకు చైనీస్ టిప్‌స్టర్ 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని రిపోర్ట్ చేశాడు. అయితే వీటిలో ఏది సరైనదో అప్పుడే కచ్చితంగా చెప్పలేం. కంపెనీ కన్ఫర్మ్ చేసే వరకు వేచి చూడాల్సిందే.

iQOO 11 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ నవంబర్ 15 న జరిగే క్వాల్కమ్ ఈవెంట్ లో లాంచ్ అవ్వనుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తర్వాత ఇదే నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. iQOO 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. ఈ డివైజ్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది. iQOO 11 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. అయితే భారత్ లో ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

iQOO 11 Pro కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 14.6ఎంపి టెలీఫోటో సెన్సర్ ఉండనున్నాయి. 50ఎంపి మెయిన్ కెమెరా సోని ఐఎంఎక్స్866 సెన్సర్ తో వస్తోంది. ప్రో వేరియంట్ లో వీ2 ఐఎస్‌పీ చిప్ ని వాడినట్లు సమాచారం. ఇదొక ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్. ప్రత్యేకించి ఇమేజింగ్ మరియు వీడియో అప్లికేషన్స్ కోసం రూపొందించారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం iQOO 11 Pro లో 32ఎంపి కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.