Home News 200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ

200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ

హైలైట్స్

ఎన్నో లీక్స్ అనంతరం ఎట్టకేలకు iQOO 11 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈలైనప్ లో iQOO 11, iQOO 11 Pro లాంచ్ అయ్యాయి. అలాగే వీటితో పాటు iQOO 7 Neo SE కూడా లాంచైంది. ఈ ఫోన్లన్నీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, హై-రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యాయి.

iQOO 11 లైనప్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ డివైజెస్ చైనాలో మాత్రమే లాంచ్ అయ్యాయి. త్వరలోనే భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

iQOO 11 స్పెసిఫికేషన్స్

iQOO 11 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO 11 కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro లో 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 50వాట్/200వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడు iQOO 11 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO 11 ధర

iQOO 11 Pro ధర

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.