
iQOO 11 ఫ్లాగ్షిప్ సిరీస్ 2022 డిసెంబర్ లో చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో ప్రో మోడల్ తో పాటు స్టాండ్రడ్ వేరియంట్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా, MEfMobile పారస్ గుగ్లాని సౌజన్యంతో iQOO 11s గురించి కథనాన్ని వెలువరించింది. ఇది స్టాండర్ట్ మోడల్స్ కంటే చవకైనది. లీక్ ద్వారా iQOO 11s లాంచ్ టైమ్ లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
iQOO 11s స్మార్ట్ ఫోన్ వీ2304 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది చైనీస్ వేరియంట్ మోడల్ నంబర్. వేరే మోడల్ నంబర్ తో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
iQOO 11s లాంచ్ టైమ్‌లైన్
టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, iQOO 11s డివైజ్ 2023 మూడో త్రైమాసికంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అంటే జులై మరియు సెప్టెంబర్ మధ్యలో ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీ ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే లాంచ్ టైమ్ లైన్ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే చాన్స్ ఉంది.
iQOO 11s స్పెసిఫికేషన్స్ (రూమర్డ్)
- మీడియాటెక్ డైమెన్సిటీ 9300/9000-సిరీస్ చిప్
- 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే
- క్వాడ్ హెచ్డీ+ రెజుల్యూషన్
రిపోర్ట్ ప్రకారం, iQOO 11s మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తోన్న తొలి ఫోన్ గా నిలవనుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 9000-సిరీస్ చిప్ తో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో వచ్చే అవకాశం ఉంది.
iQOO 11s లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1440*3200 పిక్సెట్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. కెమెరా, బ్యాటరీ తదితర వివరాలు ప్రస్తుతానికి రివీల్ కాలేదు. లాంచ్ కి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నందున, రానున్న రోజుల్లో iQOO 11s కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











