
iQOO కంపెనీ iQOO 11 సిరీస్ లో మరో ఫోన్ ని తీసుకొచ్చేందుకు పనిలో పడింది. రాబోయే iQOO 11S స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు మెరుగైన పనితీరును కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల చైనా యొక్క MIIT (పరిశ్రమ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ)లో లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ సమయం దగ్గర్లోనే ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: లీకైన Samsung Galaxy Z Fold 5 పూర్తి స్పెసిఫికేషన్స్
ఇంతకుముందు, iQOO జూలైలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని ఒక నివేదిక వెల్లడించింది. Vivo చైనా వైస్ ప్రెసిడెంట్ Jia Jingdong, Weibo పోస్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ ని షేర్ చేసారు. ఆయన రాబోయే Vivo X90S స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ ని కూడా పంచుకున్నారు. ఇంకా అంతే, ఇతర వివరాలను ఆయన ఏమీ పంచుకోలేదు. సరే, ఓసారి జింగ్ డాంగ్ షేర్ చేసిన పిక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
అఫీషియల్ గా రివీలైన iQOO 11S డిజైన్
జింగ్ డాంగ్ షేర్ చేసిన పిక్ iQOO 11 స్మార్ట్‌ఫోన్‌కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక కెమెరా లేఅవుట్ కూడా iQOO 11 స్మార్ట్‌ఫోన్‌ను పోలి ఉంటుంది. iQOO బ్రాండింగ్‌ని డివైజ్ కి దిగువన మధ్యలో కూడా చూడవచ్చు.
గతంలో, MIIT లిస్టింగ్ మోడల్ నంబర్ V2304A అని వెల్లడించింది. లిస్టింగ్ 5G సపోర్ట్ ని కూడా ధృవీకరించింది. ఇది కాకుండా, MIIT జాబితా మోనికర్ లేదా డివైజ్ యొక్క ఇతర స్పెసిఫికేషన్లను నిర్ధారించలేదు. iQOO సంస్థ తన లేటెస్ట్ డివైజ్ ని అప్‌గ్రేడ్ చేసిన Qualcomm Snapdragon 8 Gen 2 చిప్సెట్తో తీసుకొస్తుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గతంలో వెల్లడించింది.
iQOO 11S స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO 11S స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ శాంసంగ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- చిప్సెట్: iQOO 11S లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుంది.
- బ్యాటరీ, చార్జింగ్: iQOO 11S స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: iQOO 11S స్మార్ట్ ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.0 స్టోరేజీ టెక్నాలజీలను ఈ ఫోన్ లో వాడారు.
- కెమెరా: iQOO 11S డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.












