Home News లీకైన iQOO 12 బ్యాటరీ స్పెసిఫికేషన్స్: 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న డివైజ్!

లీకైన iQOO 12 బ్యాటరీ స్పెసిఫికేషన్స్: 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న డివైజ్!

Highlights
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో iQOO 12 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం
  • రీసెంట్ రిపోర్ట్ లో రివీల్ అయిన iQOO 12 స్పెసిఫికేషన్స్
  • 5000mAh బ్యాటరీ, అప్‌గ్రేడెడ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ ఉండే చాన్స్

ఈ ఏడాది మొదట్లో iQOO 11 సిరీస్ లాంచ్ చేసిన ఐకూ సంస్థ ఇప్పుడు తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 12 ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఐకూ 11 సిరీస్ లో ఐకూ 11 స్టాండర్ మోడల్ తో పాటు ఐకూ 11 ప్రో 5జీ లాంచ్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ మాత్రం భారత్ లో లాంచ్ కాలేదు. లాంచ్ అవుతుందో లేదో కూడా తెలియదు. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ TechGoing ద్వారా ఒక రీసెంట్ రిపోర్ట్ లో iQOO 12 యొక్క బ్యాటరీ వివరాలతో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO 12 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO 12 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని ఐకూ సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొత్త లీక్ ద్వారా, iQOO 12 డివైజ్ వివరాలు తెలిసాయి. దాని ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఐకూ 11 సిరీస్ కూడా ఇదే బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఇంకా లీక్ ద్వారా, iQOO 12 హ్యాండ్సెట్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలిసింది. ఇది వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ని కూడా కలిగి ఉంటుందని సమాచారం.

ఏళ్ళుగా ప్రో-మోడల్స్ కి మాత్రమే పరిమితం చేసిన హై-రేంజ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని స్టాండర్డ్ వేరియంట్ కి కూడా ఇస్తుండటం ఈసారి ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇదే ఈ సిరీస్ లో ప్రస్తుతానికి ప్రధానమైన అప్‌గ్రేడ్ గా కనిపిస్తోంది.

మరొక విషయం ఏంటేంటే, ఈసారి రాబోవు iQOO 12 డివైజ్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేస్తోంది. ఇప్పటివరకు హై-రేంజ్ ఫాస్ట్ చార్జింగ్ కలిగిన ప్రో మోడల్స్ ని ఐకూ భారత్ కి తీసుకురాలేదు. వీటిని కేవలం చైనాకు మాత్రమే పరిమితం చేసింది.

iQOO 12 Pro డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. ప్రో వేరియంట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. iQOO 12 Pro యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.