ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO గతేడాది డిసెంబర్ నెలలో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్లాట్ఫామ్ పై iQOO 12 5G డిస్కౌంట్ పై లభిస్తోంది. అంతేకాదు, ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 16జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.
iQOO 12 5G ధర, ఆఫర్లు
iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.3,999 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.49,999 కే లభించనుంది.
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, కంపెనీ రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్షాక్షన్స్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఈ రెండు ఆఫర్లు కలిపితే, iQOO 12 5G యొక్క 12జిబి+256జిబి వేరియంట్ రూ.47,999 కి లభిస్తుంది. ఈ వేరియంట్ లాంచ్ ధర రూ.52,999 గా ఉంది.
అంతేకాదు, 3 నుంచి 9 నెలల కాలపరిమితితో నోకాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఈ ఫోన్ కొనవచ్చు.
ఇంకా ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.38,400 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
iQOO 12 5G యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.3,000 డిస్కౌంట్ మరియు రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తాయి. దీంతో ఈ వేరియంట్ ని రూ.52,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్ ఆఫర్ ధర రూ.57,999 గా ఉంది.
ఎక్కడ కొనాలి?
iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆఫర్ వివరాలను ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
iQOO 12 5G ని తీసుకోవచ్చా?
iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
iQOO 12 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.
ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
