
వివో సబ్-బ్రాండ్ iQOO భారత్ లో iQOO 12 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫ్లాగ్షిప్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఐకూ నుంచి iQOO 12 5G ఇండియా లాంచ్ ప్రకటన వచ్చింది. అమెజాన్ స్పెషల్స్ పోస్టర్ ద్వారా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. పోస్టర్ ప్రకారం, iQOO 12 5G డివైజ్ 2023 డిసెంబర్ 12 న భారతగడ్డపై లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. సరే, ఓసారి iQOO 12 5G డివైజ్ లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
iQOO 12 5G లాంచ్ వివరాలు
iQOO షేర్ చేసిన పోస్టర్ ప్రకారం, iQOO 12 5G భారత్ లో డిసెంబర్ 12 వ తేదీన లాంచ్ కానుంది. ఇమేజ్ లో రియర్ కెమెరా డిజైన్ కనిపిస్తోంది. అంతకు ముందు లీకైన రెండర్స్, లైవ్ ఇమేజెస్ లో మాదిరే ఈ డిజైన్ ఉంది. పోస్టర్ ద్వారా బీఎండబ్ల్యూ మోటర్‌స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ మోడల్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా iQOO 12 5G సేల్ ఉండనుంది.
iQOO 12 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
- ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
- బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











