వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో iQOO 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ డిసెంబర్ 12 న ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెజాన్ లిస్టింగ్ ద్వారా తాజాగా ధర కూడా రివీల్ అయ్యింది. ఇకపోతే iQOO 12 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోన్న iQOO 12 యొక్క భారతీయ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
iQOO 12 ధర (లీక్)
iQOO 12 Indian Prices accidentally revealed Amazon!
12GB+256GB: ₹52,999
16GB+512GB: ₹57,999#iQOO12 #iQOO pic.twitter.com/3a4HbjKyCX— Sudhanshu Ambhore (@Sudhanshu1414) December 5, 2023
- iQOO 12 ధర అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ లిస్టింగ్ ని ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే తొలుత గుర్తించారు. ఆ వివరాలను చూద్దాం.
- iQOO 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.52,999 గా ఉంది.
- iQOO 12 డివైజ్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.57,999 గా ఉంది.
- iQOO 12 స్మార్ట్‌ఫోన్ ధర గత మోడల్ iQOO 11 కంటే తక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఇంకా కంపెనీ నుంచి అధికారికంగా ధరను ఖరారు చేయాల్సి ఉంది. అప్పుడే కచ్చితంగా ఏ విషయం చెప్పగలం.
- ప్రస్తుతం అమెజాన్ మరియు ఐకూ.కామ్ ద్వారా iQOO 12 ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 7 వరకు ఈ ప్రీ-బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. రూ.999 ప్రీ-బుకింగ్ పాస్, ఫోన్ ధరతో అడ్జస్ట్ చేయబడుతుంది. ముందుగా ఫోన్ ని కొనుగోలు చేసే వారికి రూ.2,999 విలువజేసే Vivo TWS ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి.
iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)
ఇప్పటికే iQOO 12 డివైజ్ చైనా మార్కెట్ లో లాంచైన కారణంగా స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో అంచనా వేయవచ్చు.
- డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
- ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
- బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
