
వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారత మార్కెట్ లో iQOO 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. రీసెంట్ గా లీకైన రెండర్స్ మరియు హ్యాండ్స్-ఆన్ ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ పై ఐడియా వచ్చింది. తాజాగా iQOO 12 డివైజ్ యొక్క ప్రమోషనల్ ఇమేజెస్ ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది. నవంబర్ 7 న చైనాలో iQOO 12 లాంచ్ అవుతోంది.
లీకైన ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్
- iQOO 12 స్మార్ట్‌ఫోన్ కొత్త రియర్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోంది. ఈసారి స్క్వైరికల్ షేప్ లో ఉండే మాడ్యూల్ ని మనం చూడవచ్చు.
- అలాగే ఈ డివైజ్ కర్వ్డ్ ఎడ్జెస్ గల బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
- బీఎండబ్ల్యూతో ఐకూ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందని ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
- iQOO 12 డివైజ్ బీఎండబ్ల్యూ లోగో మరియు ఫ్యాసినేషన్ మీట్స్ ఇన్నోవేషన్ అనే ట్యాగ్‌లైన్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. ఫోన్ కి టాప్ లో ఇన్ఫ్రారెడ్ సెన్సర్ కనిపిస్తోంది.
- iQOO 12 సిరీస్ భారత మార్కెట్ లోకి వస్తోందని iQOO సంస్థ అధికారికంగా ప్రకటించింది.
- గతంలో టిప్‌స్టర్ ముకుల్ శర్మ, iQOO 12 సిరీస్ నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ఆరంభంలో లాంచ్ అవుతుందని అంచనా వేశారు.
iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO 12 లో ఈ7 అమోలెడ్ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వినియోగించనున్నారు.
- మెమొరీ: iQOO 12 డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
- సాఫ్ట్వేర్: iQOO 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి 3x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: iQOO 12 డివైజ్ లో 8కే వీడియో రికార్డింగ్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.











