Home News లీకైన iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

లీకైన iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

Highlights
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO 12, iQOO 12 Pro
  • 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనున్న ఐకూ 12 ప్రో
  • త్వరలోనే లాంచ్ కానున్న iQOO 12 సిరీస్

వివో సబ్-బ్రాండ్ iQOO తన 2023 ఫ్లాగ్షిప్ డివైజెస్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. iQOO 12 సిరీస్ ని త్వరలోనే ఈ సంస్థ లాంచ్ చేయనుందని సమాచారం. ఈ లైనప్ లో iQOO 12, iQOO 12 Pro ఫోన్లు రానున్నాయి. తాజాగా iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. iQOO 12 లైనప్ 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, పెరిస్కోప్ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 144 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానుంది.

iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఎక్కువగా iQOO 12 Pro వేరియంట్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇక గత సిరీస్ అయిన iQOO 11 లైనప్ లో ప్రో వేరియంట్ లేదు. అయితే iQOO 11s అనే డివైజ్ ని ఈ ఏడాది జులై లో లాంచ్ చేశారు.