Home News Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న iQOO 12 5G; లీకైన స్పెసిఫికేషన్స్

Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న iQOO 12 5G; లీకైన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న iQOO 12
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన స్పెసిఫికేషన్స్
  • 2కే రెజుల్యూషన్ తో వస్తోన్న డివైజ్

iQOO కంపెనీ ఇటీవలి కాలంలో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. అలాగే ఈ బ్రాండ్ పై కూడా యూజర్లలో మంచి నమ్మకం ఏర్పడింది. ఈ సంస్థ నుంచి ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని జనాలు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఐకూ కంపెనీ, iQOO 11S డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. దాంతో పాటు, iQOO 12 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి iQOO 12 గురించి లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.

టిప్‌స్టర్ ద్వారా లీకైన iQOO 12 వివరాలు

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా iQOO 12 కి సంబంధించిన సమాచారం లీకైంది. తొలుత iQOO 12 డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని తర్వాత, ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుందని టిప్‌స్టర్ ద్వారా తెలిసింది. ఇంకా లాంచ్ తేదీ ఖరారు కాలేదు. కానీ, ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. iQOO 12 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది. ఇంకా 2కే రెజుల్యూషన్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

iQOO 12 స్పెసిఫికేషన్స్ (లీక్)