Home News iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, త్వరలో లాంచ్ కానున్న డివైజ్

iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, త్వరలో లాంచ్ కానున్న డివైజ్

Highlights
  • త్వరలో iQOO 13 లాంచ్
  • లీకైన స్పెసిఫికేషన్స్
  • 2కే ఓఎల్ఈడీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. iQOO 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఐకూ 13 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది. iQOO 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

iQOO 13 డివైజ్ 1.5కే డిస్ప్లే, ఐపీ68 రేటింగ్, ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO 13 ప్రో వేరియంట్ 2కే డిస్ప్లేతో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది ఫ్లాట్ ఓఎల్ఈడీ ప్యానెల్ ను కలిగి ఉంటుందని సమాచారం. అలాగే, ఈ స్క్రీన్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇంటిగ్రేట్ చేయనున్నారు.

iQOO 13 మాత్రమే భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రో వేరియంట్స్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యాయి. ఇతర ఏ మార్కెట్ లోనూ విడుదలవ్వలేదు. దీన్ని బట్టి, ఈసారి కూడా స్టాండర్డ్ మోడల్ iQOO 13 ఒక్కటే భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు. దీనిపై రానున్న రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ఇప్పుడు ఒకసారి గత మోడల్ iQOO 12 యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం.

iQOO 12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.

ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.