
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన కొత్త నంబర్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. తొలుత చైనా మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవ్వనుంది. తాజాగా ఐకూ 13 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఓసారి లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ iQOO 13 యొక్క స్పెసిఫికేషన్స్‌ను మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా లీక్ చేసింది.
లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ (1.5కే) రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
ఐకూ 13 డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో రానున్నట్లు లీక్ ద్వారా అర్థమవుతోంది.
iQOO 13 స్మార్ట్‌ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
iQOO 13 డివైజ్ భారీ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: iQOO 13 స్మార్ట్‌ఫోన్ లో 1.5కే ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. శాంసంగ్ మరియు బీఓఈ కంపెనీలకు చెందిన డిస్ప్లేలను ఐకూ తన ఫోన్లలో వినియోగించే అవకాశం ఉంది.
ప్రాసెసర్: iQOO 13 స్మార్ట్‌ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్ 2024 అక్టోబర్ లో లాంచ్ కానుంది. అంటే ఆ తర్వాతే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని చెప్పవచ్చు.
బ్యాటరీ: iQOO 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. గత మోడల్ iQOO 12 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
ఇతర ఫీచర్లు: iQOO 13 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్స్ ఉంటాయి.











