హైలైట్స్
- 2023 జనవరిలో లాంచ్ కానున్న iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్
- BIS వెబ్సైట్ పై I12214 అనే మోడల్ నంబర్ తో కనిపించిన iQOO Neo 7 5G
- 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్న iQOO Neo 7 5G
వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ రీసెంట్ గా చైనాలో ఐకూ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లతో పాటు iQOO Neo 7 SE అనే ఫోన్ ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు ఐకూ సంస్థ iQOO Neo 7 5G అనే ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా iQOO Neo 7 5G బీఐఎస్ వెబ్ సైట్ లో ఐ12214 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమైంది. లీక్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO Neo 7 5G యొక్క లాంచ్ టైమ్ లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి iQOO Neo 7 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
iQOO Neo 7 5G ఇండియా లాంచ్ , ధర (అంచనా)
Pricebaba వెబ్ సైట్ iQOO Neo 7 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ ని వెలికితీసింది. టిప్‌స్టర్ ప్రకారం, iQOO Neo 7 5G ఫోన్ 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.30,000 గా ఉండే అవకాశం ఉంది.
iQOO Neo 7 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Exclusive! ?
iQOO Neo 7 5G india ????
Moniker : I2214
-Dimensity 8200 or SD 8+ Gen 1 (likely)
-6.78", FHD+, AMOLED, 120Hz
-64MP + 2MP + 2MP
-16MP
-5000mAh, 120W
-Android 13
-8GB/12GB
– 28K< 31KThis January 2023! ??
— Paras Guglani (@passionategeekz) December 12, 2022
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ తో వస్తోంది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై తదితర బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












