12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తోన్న iQOO Neo 7 5G ఇండియన్ వేరియంట్

Highlights

  • ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న iQOO Neo 7 5G
  • భారతదేశపు తొలి డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఫోన్ గా నిలవనున్న iQOO Neo 7 5G
  • ప్రస్తుతం అమెజాన్ ఇండియా, ఐకూ ఇండియా వెబ్‌సైట్స్ ద్వారా అందుబాటులో ఉన్న iQOO Neo 7 5G ల్యాండింగ్ పేజెస్

అందుబాటు ధరల్లో అధిక ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ తక్కువ సమయంలోనే ప్రముఖ బ్రాండ్ గా అవతరించింది iQOO. త్వరలోనే ఈ సంస్థ iQOO Neo 7 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ లోపు ఫోన్ కి సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక ఫోన్ కోసం వెయిట్ చేసే వారు లాంచ్ తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 16 న ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన కీలక వివరాలు తెలిసాయి. 12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది. ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

ఐకూ నియో 7 5జీ ర్యామ్, స్టోరేజీ, అంటుటు స్కోర్

iQOO Neo 7 5G ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. భారతదేశపు తొలి డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఫోన్ గా iQOO Neo 7 5G నిలవనుంది. ప్రస్తుతం అమెజాన్, ఐకూ ఇండియా వెబ్ సైట్స్ లో iQOO Neo 7 5G మైక్రోసైట్స్ దర్శనమిస్తున్నాయి. ఐకూ కంపెనీ యొక్క Extended RAM 3.0 టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కెపాసిటీతో వస్తోంది.

ఇక డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో కూడిన iQOO Neo 7 5G AnTuTu స్కోర్ విషయానికి వస్తే ఇది 893,690 స్కోర్ ని నమోదు చేసింది. ఈ స్కోర్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ కి చెందినదని కంపెనీ చెప్పింది.

ఐకూ నియో 7 5జీ స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తోంది. iQOO Neo 7 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫుల్ సైజ్ 3డీ కూలింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టివిటీ, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఈ మోడల్ లో అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో రావడం లేదు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.30,000 గా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV
Next articleఫిబ్రవరి 6న లాంచ్ అవుతోన్న POCO X5 Pro; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.