హైలైట్స్
- Neo సిరీస్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసిన ఐకూ
- చైనాలో ఎంట్రీ ఇచ్చిన iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్766వీ లెన్స్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
Neo సిరీస్ లో iQOO సంస్థ కొత్త ఫోన్ iQOO Neo 7 5G ని లాంచ్ చేసింది. నియో 6 5జీ ఫోన్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. త్వరలోనే iQOO Neo 7 5G భారత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. iQOO Neo 7 5G మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తోంది.
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ లో భారీ అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. iQOO Neo 7 5G తో పాటు ఐకూ సంస్థ iQOO TWS Air ని కూడా లాంచ్ చేసింది. iQOO Neo 7 5G మరియు iQOO TWS Air ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
iQOO Neo 7 5G ధర, స్పెసిఫికేషన్స్
iQOO Neo 7 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కౌటౌట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డిస్ప్లే చిప్ ఉన్నాయి. iQOO Neo 7 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్ అమర్చారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO Neo 7 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. గ్లోబల్ వేరియంట్ ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ ని కలిగి ఉండనుంది.
ఇప్పుడు iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వీ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా అందించారు.
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 4013MM స్క్వేర్ భారీ లిక్విడ్ వేపర్ చాంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 8GB + 128GB వేరియంట్ ధర CNY 2699 (సుమారు రూ.30,900), 8GB + 256GB వేరియంట్ ధర CNY 2999 (సుమారు రూ.34,300), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3299 (సుమారు రూ.37,700), 12GB + 512GB యూనిట్ ధర CNY 3599 (సుమారు రూ.41,200). iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
iQOO Neo 7 5G తో పాటు TWS Air కూడా లాంచ్ అయ్యింది. iQOO TWS Air సెమీ-ఇన్-ఇయర్ డిజైన్ ని కలిగి ఉంది. ఈ టీడబ్ల్యూఎస్ ఎయిర్ ధర CNY 199 (దాదాపు రూ.2,300).
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












