ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే మరొక నియో సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. iQOO Neo 7 Pro పేరుతో ఈ ఫోన్ రానుంది. చైనాలో లాంచైన iQOO Neo 8 కి ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని చెబుతున్నారు.
ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ జూన్ 20 న లాంచ్ అవుతుందని తెలిపారు. లాంచ్ తేదీతో పాటు, భారత్ లో iQOO Neo 7 Pro ధర శ్రేణిని కూడా పారస్ రివీల్ చేశారు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Can confirm that iQOO Neo 7 Pro will be launched with high end 16GB Variant along with 256GB Storage, Only in black and will fall in 38-42K price segment!
IQOO Neo 7 Pro 5G coming on 20th june #IqooNeo7Pro #IQOO
— Paras Guglani (@passionategeekz) June 1, 2023
16జిబి ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 7 Pro
- టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, ట్విట్టర్ ద్వారా ఐకూ నియో సిరీస్ ఫోన్ సమాచారాన్ని పంచుకున్నారు.
- బ్లాక్ కలర్ వేరియంట్ లో ఇండియాలో iQOO Neo 7 Pro లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
- 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ భారత్ లో అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
భారత్ లో iQOO Neo 7 Pro ధర
- భారత్ లో iQOO Neo 7 Pro ధర రూ.38,000 నుంచి రూ.42,000 మధ్య ఉంటుందని పారస్ తెలిపారు.
- అయితే ఈ ధర బేస్ వేరియంట్ కి సంబంధించిందా లేదా 16జిబి+256జిబి వేరియంట్‌కి చెందినదా అనేది ఇంకా తెలియదు.
- గీక్ బెంచ్ పై I2217 అనే మోడల్ నంబర్ తో iQOO Neo 7 Pro ఇండియన్ వేరియంట్ కనిపించింది. అదే లిస్ట్ ద్వారా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలిసింది.
- iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ చైనాలో గత వారం లాంచైన iQOO Neo 8 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే, iQOO Neo 8 మాదిరి స్పెసిఫికేషన్స్ iQOO Neo 7 Pro లో ఉండే అవకాశం ఉంది. ఓసారి ఐకూ నియో 8 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
iQOO Neo 8 (చైనీస్ వేరియంట్) స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO Neo 8 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 8 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.
- మెమొరీ, స్టోరేజీ: iQOO Neo 8 లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్ వేర్: iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, వీ1+ చిప్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 8 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ అందించారు.
- కనెక్టివిటీ, సెక్యూరిటీ: iQOO Neo 8 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- కలర్స్, ఆడియో: iQOO Neo 8 డివైజ్ లో స్టీరియో స్పీకర్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- డైమెన్షన్స్, వెయిట్: iQOO Neo 8 డివైజ్ 164.72 మి.మీ పొడవు, 77.0 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 194.6 గ్రాముల బరువు ఉంటుంది.
