Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలోనే iQOO Neo 9 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ iQOO Neo 7 Pro ధరను కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం iQOO Neo 7 Pro పై రూ.4,000 తగ్గింపుతో ఫోన్ ధర యూజర్ కి మరింత అందుబాటులోకి వచ్చింది. iQOO Neo 7 Pro డివైజ్ 8జిబి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro యొక్క కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
iQOO Neo 7 Pro ధర
- iQOO Neo 7 Pro స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- iQOO Neo 7 Pro 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.34,999 తో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ తో దీని ధర రూ.30,999 కి చేరుకుంది.
- iQOO Neo 7 Pro 12జిబి ర్యామ్ వేరియంట్ రూ.37,999 తో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ తో దీని ధర రూ.33,999 కి చేరుకుంది.
- ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూజర్లకు iQOO Neo 7 Pro కొనుగోలుపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
- iQOO అధికార వెబ్సైట్ లో కొత్త ధరలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 730 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని కలిగి ఉంది.
- ఓఎస్: iQOO Neo 7 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO Neo 7 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
