Home News iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్

హైలైట్స్

ఐకూ సంస్థ త్వరలోనే iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. డిసెంబర్ 29 న చైనాలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని సమాచారం. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఫోన్ ఎంట్రీ ఇస్తుంది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ప్రీమియమ్ హార్డ్‌వేర్ తో వస్తోంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు iQOO సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ పెర్ఫామెన్స్-ఫోకస్డ్ ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ గా వస్తోంది. ఈ ఫోన్ లో ఫ్లాగ్షిప్-గ్రేడ్ హార్డ్‌వేర్ ని ఉపయోగించనున్నారు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు ఇప్పటికే ఖరారైంది. తాజాగా ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. కేవలం 8 నిమిషాల్లో ఈ ఫోన్ బ్యాటరీ 1 నుంచి 50 శాతానికి చేరుకుంటుందని తెలుస్తోంది.

రానున్న రోజుల్లో iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఐకూ నుంచి వెలువడే అవకాశం ఉంది. ఈలోపు రూమర్ రాయుళ్ళ నుంచి ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. వాటి ప్రకారం, iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో కూడా లభ్యం కానుంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉంటాయి. ఇప్పటికైతే ఈ ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

iQOO Neo 7 Racing Edition Specs

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.