హైలైట్స్
- వివో సబ్-బ్రాండ్ ఐకూ నుంచి త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్
- డిసెంబర్ 29 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్
వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ నుంచి త్వరలో iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ విషయం పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. సరే ఓసారి iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ లాంచ్ తేదీ
iQOO Neo 7 Racing with a Snapdragon 8+ Gen 1 + Pro+ independent chip will launch on December 29 in China.#iQOO #iQOONeo7Racing pic.twitter.com/U6wIHubDhB
— Mukul Sharma (@stufflistings) December 23, 2022
రివీల్ అయిన పోస్టర్ ని బట్టి, iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ చైనాలో డిసెంబర్ 29 న లాంచ్ అవుతోంది. అయితే, గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. గత రిపోర్ట్ ప్రకారం, ఈ చిప్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో పెయిర్ కాబడిందని తెలిసింది. ఇంకా మిగతా స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి.
ఇప్పటివరకు బయటకు వచ్చిన స్పెసిఫికేషన్స్ ని బట్టి, iQOO Neo 7 లో అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ఉండనుందని తెలుస్తోంది.
iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. ఈ డివైజ్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అలాగే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
iQOO Neo 7 Racing Edition Specs
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- అమోలెడ్ డిస్ప్లే
- ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్
- 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్
- ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.