Home News iQOO Neo 7 SE లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; 120W చార్జింగ్, 12GB ర్యామ్ తో వస్తోన్న డివైజ్

iQOO Neo 7 SE లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; 120W చార్జింగ్, 12GB ర్యామ్ తో వస్తోన్న డివైజ్

హైలైట్స్

డిసెంబర్ 2 న iQOO 11 సిరీస్ లాంచ్ అవుతుందని ఇటీవలె iQOO ప్రకటించింది. అయితే అదే రోజున iQOO Neo సిరీస్ కూడా లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. నియో సిరీస్ లో వస్తోన్న iQOO Neo 7 SE డిసెంబర్ 2 న లాంచ్ అవ్వబోతోంది. చాలామంది స్మార్ట్ ఫోన్ లవర్స్ ఈ డివైజ్ కోసం వేచి చూస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

iQOO Neo 7 SE లాంచ్ తేదీ

నియో సిరీస్ లో భాగంగా త్వరలో రాబోవు iQOO Neo 7 SE ఫోన్ యొక్క లాంచ్ తేదీని ఐకూ కంపెనీ ప్రకటించింది. iQOO Neo 7 SE లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 2 న మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవుతుంది. తొలుత చైనాలో iQOO Neo 7 SE లాంచ్ అవుతుంది. తర్వాత ఈ డివైజ్ ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ పవర్ఫుల్ చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 SE లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.

iQOO Neo 7 SE కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం, ఈ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో కెమెరాతో వస్తుందని అనుకున్నారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ని, తాజా నివేదికలతో పోల్చితే తేడా కనిపిస్తోందని అర్థమవుతోంది. దీన్ని బట్టి బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా మారే అవకాశం ఉంది.

iQOO Neo 7 SE డివైజ్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, గెలాక్సీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. రానున్న రోజుల్లో ఐకూ నియో 7 ఎస్ఈ ఫోన్ కి సంబంధించిన కచ్చితమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.