Dimensity 9000+ చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న iQOO Neo 7

హైలైట్స్:

  • లీకైన iQOO Neo 7 స్పెసిఫికేషన్స్
  • డైమెన్సిటీ 9000+ చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO Neo 7
  • ఈ నెలలో చైనాలో iQOO Neo 7 లాంచ్ అవుతుందని అంచనా

iQOO కంపెనీ త్వరలో iQOO Neo 7 ని లాంచ్ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. iQOO Neo 7 లాంచ్ కి సంబంధించిన వివరాలను ఐకూ సంస్థ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు చైనాలో iQOO Neo 7 ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో విషయాలు లీక్ అయ్యాయి. తాజాగా iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్ ని చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ బాల్డ్ పండా వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం, iQOO Neo 7 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం.

టిప్‌స్టర్ చెబుతున్నది నిజమైతే గనుక, నియో సిరీస్ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాబోవు తొలి ఫోన్ గా iQOO Neo 7 నిలవనుంది. ఐకూ నియో 6 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. మరి తాజాగా లీకైన iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.

iQOO Neo 7 స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తుందని ఇదివరకు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన ఈ చిప్సెట్ ని మీడియాటెక్ సంస్థ ఈ సంవత్సరం జూన్ లో లాంచ్ చేసింది. ఇక iQOO Neo 7 లో మాలి-జీ710 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడినట్లు సమాచారం.

iQOO Neo 7 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 6.62-ఇంచ్ డిస్ప్లే, సెంటర్ పంచ్-హోల్ కెమెరా ని కలిగి ఉండనున్నట్లు డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.

ఇప్పుడు కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. iQOO Neo 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్766వీ సెన్సర్ వాడినట్లు సమాచారం. ఐకూ 8ప్రో చైనా వేరియంట్ లో ఇదే సెన్సర్ ని వాడారు. ఇక 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12 మెగా పిక్సెల్ పొట్రెయిట్-టెలీఫోటో కెమెరా iQOO Neo 7 లో ఉండనున్నాయి.

ఇటీవలె iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ డిజైన్ పిక్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే ఐకూ సంస్థ నియో 7 యొక్క లో-లైట్ కెమెరా పనితీరుని టీజ్ చేస్తూ ఒక పిక్ ని బయటకు వదిలింది. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరిన్ని ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.