ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 Pro డివైజ్ ని చైనాలో లాంచ్ చేయబోతోంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చైనాలో ఎంట్రీ తర్వాత మిగతా మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. ఈ ఫోన్ అత్యధిక అంటుటు స్కోర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే iQOO Neo 8 సిరీస్ చైనాలో మే 23 న లాంచ్ అవుతోంది. తాజాగా iQOO Neo 8 Pro ఫోన్ అంటుటు స్కోర్, ర్యామ్ మరియు స్టోరేజీ వివరాలు రివీల్ అయ్యాయి.
సరే, ఓసారి iQOO Neo 8 Pro కి సంబంధించి బయటకు వచ్చిన ముఖ్య సమాచారం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అంటుటు స్కోర్
- 13,63,206 పాయింట్లు
iQOO Neo 8 Pro డివైజ్ మే 23 న లాంచ్ అవుతోంది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ హయ్యస్ట్ అంటుటు స్కోర్ నమోదు చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ గా చెప్పబడుతోంది. iQOO Neo 8 Pro డివైజ్ 13,63,206 పాయింట్ల అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. ఇది ASUS ROG Phone 7 సిరీస్ (13,30,011) కంటే అత్యధికం.
iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్
ప్రాసెసర్
- డైమెన్సిటీ 9200+ చిప్సెట్
- 4ఎన్ఎమ్ ఫ్యాబ్రికేషన్
iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్ 4 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇది 3.35 గిగా హెర్ట్జ్ పీక్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఒక కార్టెక్స్ ఎక్స్3 ప్రైమర్ కోర్, 3 కార్టెక్స్ ఏ715 కోర్స్ 3.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉండగా, 4 కార్టెక్స్ ఏ510 కోర్స్ 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త మీడియాటెక్ చిప్సెట్, మాలి-జీ715 జీపీయూ ని కలిగి ఉంది.
ర్యామ్, స్టోరేజీ
- 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్
- 512జిబి యూఎఫ్ఎస్ 4.0
iQOO Neo 8 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
డిస్ప్లే
- 1.5కే రెజుల్యూషన్
- అమోలెడ్ డిస్ప్లే
iQOO Neo 8 మరియు iQOO Neo 8 Pro ఫోన్లు 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 6.78-అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ ని కలిగి ఉంటాయని సమాచారం.
బ్యాటరీ, చార్జింగ్
- 120 వాట్
- 5000 ఎంఏహెచ్
iQOO Neo 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనున్నాయి.
కెమెరా, ఓఎస్
- 50ఎంపి ఓఐఎస్ కెమెరా
- 16ఎంపి సెల్ఫీ కెమెరా
iQOO Neo 8 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. iQOO Neo 8 సిరీస్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
