iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ చైనాతో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే లాంచ్ కి ముందు ఈ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ పై V2302A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ద్వారా iQOO Neo 8 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి.
iQOO Neo 8 Pro లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుందని, 512జిబి స్టోరేజీ వరకు ఉండనుందని సమాచారం. గతంలో ఈ ఫోన్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. కానీ, కంపెనీ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఫోన్ గురించి ప్రకటన చేయలేదు. సరే, ఓసారి iQOO Neo 8 Pro డివైజ్ అంటుటు స్కోర్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.
iQOO Neo 8 Pro AnTuTu స్కోర్
అంటుటు లిస్టింగ్ ప్రకారం iQOO Neo 8 Pro డివైజ్ V2302A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ బెంచ్ మార్కింగ్ సైట్ పై డివైజ్ 13,68,597 పాయింట్ల స్కోర్ చేసింది. చైనాలో వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది.
లిస్టింగ్ ద్వారా iQOO Neo 8 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని తెలిసింది. ఈ చిప్సెట్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో జతకూడి వస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తొలుత ఈ లిస్టింగ్ ని గుర్తించాడు.
iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: iQOO Neo 8 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
చిప్సెట్: ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని సమాచారం.
కెమెరాలు: ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 1/1.5-ఇంచ్ సెన్సర్ అని 91mobiles Hindi తెలిపింది. ఇతర సెన్సర్స్ అల్ట్రావైడ్, టెలీఫోటో లెన్సెస్ అయి ఉంటాయని అంచనా. కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.
ర్యామ్ మరియు స్టోరేజీ: ఈ స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ తో వస్తోందని సమాచారం. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా వస్తోందని తెలుస్తోంది.
బ్యాటరీ: iQOO Neo 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఇంకా ఏ విషయం ఖరారు కాలేదు.
ఓఎస్: iQOO Neo 8 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుంది. చైనీస్ మార్కెట్ లో ఒరిజిన్ ఓఎస్3 కస్టమ్ స్కిన్, ఇతర మార్కెట్స్ లో ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ ఉండనున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
