వివో సబ్-బ్రాండ్ ఐకూ iQOO Neo 8 సిరీస్ చైనా లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ లైనప్ చైనాలో మే 23 న ఎంట్రీ ఇవ్వనుంది. ఐకూ చైనా వెబ్‌సైట్ ద్వారా లాంచ్ ఈవెంట్ ను లైవ్‌లో వీక్షించవచ్చు. అలాగే ఈ సిరీస్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అవి: iQOO Neo 8, iQOO Neo 8 Pro. సరే, ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి బయటకు వచ్చిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. చదివి తెలుసుకోండి.
iQOO Neo 8 సిరీస్ లాంచ్ పోస్టర్
లాంచ్ పోస్టర్ ని బట్టి iQOO Neo 8 సిరీస్ వీ1+ చిప్సెట్, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు, iQOO Pad ట్యాబ్లెట్ కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తున్నట్లు సమాచారం.
iQOO Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
- 1.5కే అమోలెడ్ డిస్ప్లే
- 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
iQOO Neo 8 Pro డివైజ్ 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ తో రానున్నట్లు సమాచారం.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ
- డైమెన్సిటీ 9200+
- 16జిబి ర్యామ్
- 512జిబి స్టోరేజీ
iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
ఓఎస్, బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
iQOO Neo 8 సిరీస్ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఈ సిరీస్ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై తదితర ఫీచర్స్ ఉంటాయి.
