Vivo సబ్-బ్రాండ్ iQOO తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారతీయ మార్కట్ లో లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. అయితే లాంచ్ తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఐకూ ఇండియా iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ని సోషల్ మీడియా వేదికల ద్వారా టీజ్ చేసింది. సరే, ఓసారి iQOO Neo 9 Pro లాంచ్ కి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ వివరాలు
NEO Powering soon. #StayTuned to witness the peak of performance and design this Feb’ 2024. #iQOO #PowerToWin #StayTuned pic.twitter.com/rqAPq1RavA
— iQOO India (@IqooInd) January 3, 2024
- iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్ లాంచ్‌ని ఐకూ ఇండియా తన X ఖాతా ద్వారా టీజ్ చేసింది.
- iQOO Neo 9 Pro భారత్ లో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని కంపెనీ తన పోస్ట్ ద్వారా వెల్లడించింది.
- iQOO Neo 9 Pro యొక్క కచ్చితమైన లాంచ్ తేదీన మాత్రం కంపెనీ తెలుపలేదు. రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.
iQOO Neo 9, Neo 9 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
- iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.
