లాంచ్‌కి ముందు లీకైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • తాజాగా లీకైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్
  • 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోన్న ఫోన్

iQOO Neo 9 Pro స్మార్ట్ ఫోన్ డిసెంబర్ నెలలో లాంచ్ కానుంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. అయితే ఈలోపే iQOO Neo 9 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్షమయ్యాయి. మరి ఆ లీక్స్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X ప్లాట్ఫామ్ పై iQOO Neo 9 Pro కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశారు.

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్, 50ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 Pro లో క్యూ1 చిప్, ఐఆర్ సెన్సర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
Previous articleOnePlus 12: Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ 12
Next article8GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Huawei Enjoy 70
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.