ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ లైనప్ లో ఇప్పటికే Neo 9, Neo 9 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నియో 9ఎస్ ప్రో డివైజ్ లాంచ్‌కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9s Pro ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
iQOO Neo 9s Pro డివైజ్ వచ్చే నెలలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
iQOO Neo 9s Pro డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
లీక్ ప్రకారం, iQOO Neo 9s Pro డివైజ్ తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ ధర 3000 యువాన్లు (సుమారు రూ.34,600) గా ఉంటుందని అంచనా.
iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
లీకైన సమాచారం ప్రకారం, iQOO Neo 9s Pro స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ వేరియంట్ ఈ చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.
iQOO Neo 9s Pro డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ డివైజ్ కి సంబంధించిన కొన్ని ఫీచర్లు గత మోడల్ నియో 9 ప్రో మాదిరి ఉంటాయని సమాచారం.
