Home News iQOO Neo 9s Pro Plus: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన ఐకూ ఫోన్

iQOO Neo 9s Pro Plus: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన ఐకూ ఫోన్

Highlights
  • త్వరలో iQOO Neo 9s Pro Plus లాంచ్
  • 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro Plus పేరుతో ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

iQOO Neo 9s Pro Plus స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 9s Pro Plus లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 9s Pro Plus లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: iQOO Neo 9s Pro Plus డివైజ్ 12జిబి ర్యామ్/16జిబి ర్యామ్, 256జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: iQOO Neo 9s Pro Plus లో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ S5KJN1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: iQOO Neo 9s Pro Plus లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Neo 9s Pro Plus లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

iQOO Neo 9s Pro Plus ధర

iQOO Neo 9s Pro Plus 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 2999 యువాన్లు (సుమారు రూ.34,500) గా నిర్ణయించారు.

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 3399 యువాన్లు (సుమారు రూ.39,100) గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర 3299 యువాన్లు (సుమారు రూ.37,900) గా ఉంది.

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 3699 యువాన్లు (సుమారు రూ.42,500) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 4099 యువాన్లు (సుమారు రూ.47,100) గా ఉంది.

iQOO Neo 9s Pro Plus స్మార్ట్‌ఫోన్ చైనాలో బఫ్ బ్లూ, స్టార్ వైట్ మరియు ఫైటింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.