iQOO Neo 9S Pro Plus: లాంచ్‌కి ముందు ఖరారైన నియో 9ఎస్ ప్రో+ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో iQOO Neo 9S Pro+ లాంచ్
  • జులై 11న లాంచ్ అయ్యే అవకాశం
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 11న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఖరారయ్యాయి. సంస్థ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ ఈ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

iQOO Neo 9S Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు

iQOO Neo 9S Pro+ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను ఐకూ బ్రాండ్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ Weibo పై షేర్ చేశారు.

iQOO Neo 9S Pro+ డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో తో వస్తోంది. క్యూ1 గ్రాఫిక్స్ చిప్ ను గేమింగ్ కోసం అందిస్తున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటాయి.

iQOO Neo 9S Pro+ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో వస్తోంది.

iQOO Neo 9S Pro+ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వస్తోంది.

iQOO Neo 9S Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 9s Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 9s Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్, క్యూ1 గేమింగ్ చిప్, 6కే వీసీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9s Pro లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: iQOO Neo 9s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: iQOO Neo 9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది.

ఓఎస్: iQOO Neo 9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Neo 9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Previous articleRealme C63: 45W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ ఫోన్
Next articleOPPO A3: IP65 రేటింగ్‌తో చైనాలో లాంచైన ఒప్పో ఏ3
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.