హైలైట్స్:
- చైనాలో లాంచ్ అయిన ఐకూ జెడ్6 స్మార్ట్ ఫోన్, ఇప్పటికే భారత్ లో అందుబాటులో ఉన్న జెడ్6
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- ఐకూ జెడ్6 ధర RMB 1699 (దాదాపు రూ.19,800) నుంచి ప్రారంభం
ఐకూ జెడ్6 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. జెడ్ సిరీస్ లో వచ్చిన కొత్త మోడల్ ఈ జెడ్6 స్మార్ట్ ఫోన్. అయితే ఈ ఫోన్ ఇప్పటికే భారత్ లో అందుబాటులో ఉంది. చైనా వేరియంట్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ ని కలిగి ఉండగా, ఇండియా వేరియంట్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఐకూ జెడ్6 లో సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.
ఐకూ జెడ్6 లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
iQOO Z6 ధర
ఐకూ జెడ్6 8జిబి+128జిబి వేరియంట్ ధర RMB 1699 (దాదాపు రూ.19,800) గా ఉంది. ఇక 8జిబి+256జిబి వేరియంట్ ధర RMB 1899 (రూ.22,200) గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర RMB 2099 (రూ.24,500) గా ఉంది. బ్లాక్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభించే ఈ ఫోన్ సెప్టెంబర్ 1 నుంచి చైనాలో విక్రయించబడుతుంది.
iQOO Z6 స్పెసిఫికేషన్స్
ఐకూ జెడ్6 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 650 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 91.13 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ 5జీ ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఐకూ జెడ్6 5జీ ఫోన్లో 64ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఎస్5కేజీడబ్ల్యూ3 సెన్సర్ (ఓఐఎస్), 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 8ఎంపి కెమెరా ఉంది. భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందించారు. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు జెడ్6 5జీ లో ఉన్నాయి. మొత్తానికి భారత వేరియంట్ తో పోల్చితే, చైనా వేరియంట్ లో ఫీచర్లు ఎంతో మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.