హైలైట్స్
- గత నెలలో భారత మార్కెట్ లో లాంచ్ అయిన iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో లాంచ్ అయిన తొలి స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G
- న్యూ అప్డేట్ ద్వారా Extended RAM 3.0 ఫీచర్ పొందిన iQOO Z6 Lite 5G
iQOO కంపెనీ గత నెలలో భారత మార్కెట్ లో iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G కావడం విశేషం. iQOO Z6 Lite 5G 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. లాంచ్ తర్వాత నెల రోజులకు ఇప్పుడు, ఐకూ సంస్థ iQOO Z6 Lite 5G యూజర్లకు కొత్త అప్డేట్ ని రోలౌట్ చేయడం మొదలు పెట్టింది.
లేటెస్ట్ అప్డేట్ ద్వారా iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ Extended RAM 3.0 ఫీచర్ ని పొందబోతోంది. అంటే 6జిబి అదనపు ర్యామ్ ప్రయోజనం యూజర్లకు చేకూరనుంది.
Extended RAM 3.0 ఫీచర్ తో 12GB వరకు పెరగనున్న RAM
మల్టీ టాస్కింగ్ విషయంలో తన యూజర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఐకూ సంస్థ iQOO Z6 Lite 5G కి 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ని ఎనేబుల్ చేసింది. 4జిబి ర్యామ్ వేరియంట్ లో 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. iQOO Z6 Lite 5G 128జిబి స్టోరేజీ మోడల్ యూజర్లు 12జిబి ర్యామ్ ని పొందుతారు. 64జిబి స్టోరేజీ వేరియంట్ యూజర్లు 8జిబి ర్యామ్ ని పొందవచ్చు. మల్టీ టాస్కింగ్ కి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
నేటి నుంచి ఓటీఏ (Over The Air) ద్వారా కొత్త అప్డేట్ రోలౌట్ అవుతుందని iQOO కంపెనీ వెల్లడించింది. అంటే రోలౌట్ పూర్తయ్యేందుకు రెండు రోజుల సమయం పట్టనుంది.
iQOO Z6 Lite 5G స్పెసిఫికేషన్స్, ధర
iQOO Z6 Lite 5G 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 6.58-ఇంచ్ డిస్ప్లే ని కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ షూటర్ ని అమర్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో అమర్చారు. అలాగే అడ్రెనో జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడారు. ఈ ఫోన్ లో 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.
iQOO Z6 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 8 ఎంపి కెమెరా అందించారు. ఈ హ్యాండ్సెట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు.
iQOO Z6 Lite 5G మిస్టిక్ నైట్, స్టెల్లార్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 75.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.25 మిల్లీ మీటర్ల మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది. iQOO Z6 Lite 5G ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 పై పని చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, వైఫై, బ్లూటూత్ 5.3, టైప్-సీ పోర్ట్, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంది.
iQOO Z6 Lite 5G 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. మరోవైపు 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.15,499 గా ఉంది. అమెజాన్ ఇండియా మరియు ఐకూ స్టోర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













