హైలైట్స్:
- గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన Vivo X80 Lite, iQOO Z6x
- లిస్టింగ్ లో కనిపిస్తోన్న వీ2164కేఏ, వీ2202 అనే మోడల్ నంబర్లు
- ఇంకా తెలియాల్సి ఉన్న Vivo X80 Lite, iQOO Z6x ఫోన్స్ యొక్క హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్
ప్రస్తుతం iQOO Z6 సిరీస్ లో iQOO Z6 5G, iQOO Z6 Pro 5G, iQOO Z6 44W అనే ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు, ఈ లైనప్ లో iQOO Z6x అనే కొత్త మోడల్ ని తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఐకూ జెడ్6ఎక్స్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించింది. అయితే ఆ లిస్ట్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ బయటకు రాలేదు. కానీ, ఫోన్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన జెడ్ సిరీస్ ఫోన్స్ మాదిరే ఇది ఐకూ జెడ్6ఎక్స్ కూడా ఒక మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయ్యిండే చాన్సెస్ ఉన్నాయి.
ఐకూ జెడ్6ఎక్స్ కాకుండా, Vivo X80 సిరీస్ కూడా ఓ ఫోన్ లైన్లో ఉంది. ఈ సిరీస్ లో రానున్న Vivo X80 Lite 5జీ ఫోన్ కూడా గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించింది. ఎక్స్80 సిరీస్ ఇప్పటికి వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రో, వివో ఎక్స్80 ప్రో+ అనే మూడు ఫోన్ ఉండగా ఇప్పుడు వివో ఎక్స్80 లైట్ 5జీ నాల్గో ఫోన్ గా వీటితో చేరుతోంది.
గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన iQOO Z6x, Vivo X80 Lite
గూగుల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో వీ2164కేఏ మోడల్ నంబర్ తో ఐకూ జెడ్6ఎక్స్ కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ లిస్త్ లో ఐకూ జెడ్6, జెడ్6 ప్రో కూడా కనిపించాయి. ఇక మోడల్ నంబర్ తప్పితే, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఏమీ కనిపించలేదు. త్వరలోనే ఐకూ జెడ్6ఎక్స్ డివైజ్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
మరోవైపు, వివో ఎక్స్80 లైట్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ వేరియంట్ వివో ఎక్స్80 కి కాస్త డౌన్-గ్రేడెడ్ వర్షన్ అని చెప్పవచ్చు. గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ ద్వారా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలియలేదు. కేవలం వీ2202 అనే మోడల్ నంబర్ మాత్రమే కనిపిస్తోంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది క్వాల్కమ్ తయారు చేసిన లేటెస్ట్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ చిప్సెట్.
స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, శాంసంగ్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైంది. అలాగే ఇది స్నాప్ డ్రాగన్ 778జి చిప్ కి సక్సెసర్. ఇది మరింత మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది. అయితే ఈ చిప్సెట్ కలిగిన ఫోన్ ధర కూడా పెరుగుతుందన్న సంగతి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.