iQOO సంస్థ ఇప్పటికే Z-సిరీస్ స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G ని టీజ్ చేయడం మొదలుపెట్టింది. డివైజ్ ని 2023 మార్చి 21 న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. గూగుత్ సెర్చ్ లో కాసేపు యాడ్ రూపంలో కనిపించడంతో iQOO Z7 5G లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. తాజాగా ఐకూ iQOO Z7 5G ఫ్రంట్ లుక్ ని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రివీల్ చేసింది.
రివీలైన iQOO Z7 5G ఫ్రంట్ డిజైన్
It's time to say hello to stunning visuals, elevate your camera game to the next level and shoot your shot with #iQOOZ7 5G, our #FullyLoaded Smartphone for a #FullyLoadedYou! ??#ComingSoon on @amazonIN pic.twitter.com/B4xB4u9C65
— iQOO India (@IqooInd) March 6, 2023
పైన అఫీషియల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా, iQOO Z7 5G ఫ్రంట్ లుక్ ఉంటుంది. డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఇక ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అయితే ఫోన్ యొక్క ఇతర యాంగిల్స్ ని కంపెనీ ప్రదర్శించలేదు. మరికొన్ని రోజులు ఆగితే iQOO Z7 5G పూర్తి డిజైన్ కనిపించనుంది.
iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ డివైజ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో వస్తుందా? లేదా అమోలెడ్ ప్యానెల్ తో వస్తుందా? అనే విషయం ఇంకా తెలియదు. iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో రానుందని అంచనా వేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో కూడా వచ్చే అవకాశం ఉంది.
iQOO Z7 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. iQOO Z7 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. iQOO Z7 5G బ్యాటరీ విభాగం విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది.
ఇప్పుడు iQOO Z7 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Z7 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇది ఓఐఎస్ సపోర్ట్ తో రావొచ్చని అంచనా. ఫ్రంట్ కెమెరా మరియు మిగతా రియర్ లెన్సెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే iQOO Z7 5G కి సంబంధించిన ఇతర ప్రధాన వివరాలు తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
