Home News Dimensity 7200 చిప్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7 Pro 5G

Dimensity 7200 చిప్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7 Pro 5G

Highlights
  • నేడు భారత్ లో లాంచైన iQOO Z7 Pro 5G
  • 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • అమెజాన్ ఇండియా ద్వారా సేల్

వివో సబ్-బ్రాండ్ అయిన iQOO నేడు భారత్ లో iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ స్క్రీన్, గ్రేడియంట్ డిజైన్ తో వచ్చింది. iQOO Z7 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి iQOO Z7 Pro 5G యొక్క భారత మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO Z7 Pro 5G ధర, సేల్ వివరాలు

iQOO Z7 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. సెప్టెంబర్ 5 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి iQOO Z7 Pro 5G డివైజ్ సేల్ కి రానుంది. అమెజాన్ ఇండియా, ఐకూ ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ పై అదనంగా రూ.2,000 తగ్గింపు ఉంటుంది.

iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్