త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 Pro 5G; టీజర్ ఇమేజ్ షేర్ చేసిన కంపెనీ!

Highlights

  • వచ్చే నెలో iQOO Z7 Pro 5G లాంచ్ అయ్యే అవకాశం
  • టీజర్ ఇమేజ్ షేర్ చేసిన ఐకూ సీఈవో నిపుణ్ మార్య
  • కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న iQOO Z7 Pro 5G

ఈ ఏడాది మార్చి నెలలో ఐకూ సంస్థ iQOO Z7 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు iQOO Z7 Pro 5G ని లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ సీఈవోనే టీజర్ ఇమేజ్ ద్వారా ఖరారు చేశారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి బెటర్ స్పెసిఫికేషన్స్, అప్‌గ్రేడ్స్ తో రానున్నట్లు సమాచారం. సరే, రండి, ఓసారి iQOO Z7 Pro 5G కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO Z7 Pro 5G టీజర్ ఇమేజ్

సోషల్ మీడియా వేదిక ద్వారా ఐకూ సంస్థ సీఈవో నిపుణ్ మార్య iQOO Z7 Pro 5G లాంచ్ వివరాలను పంచుకున్నారు.

  • తన పోస్ట్ లో నిపుణ్ మార్య.. తమ కొత్త డివైజ్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలిపారు. దీంతో పాటు, ఆయన కర్వ్డ్ డిస్ప్లే గురించి కూడా తెలిపారు.
  • టీజర్ ఇమేజ్ లో కొత్త డివైజ్ కర్వ్డ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్ తో ఉండటం గమనించవచ్చు.
  • లాంచ్ టైమ్‌లైన్ గురించి కంపెనీ నుంచి కచ్చితమైన తేదీ ప్రకటన రాలేదు. కానీ, కమింగ్ సూన్ అని కంపెనీ సీఈవో తన పోస్ట్ లో రాసుకొచ్చారు. దీని బట్టి, iQOO Z7 Pro 5G డివైజ్ ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ఆరంభంలో లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు.

iQOO Z7 Pro 5G ధర (అంచనా)

ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న iQOO Z7 5G 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,990 గా ఉంది. ఇక iQOO Z7 Pro 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తే, స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మరి iQOO Z7 Pro 5G లో డిస్ప్లే, ప్రాసెసర్ తో పాటు ఇంకా ఏ మార్పులు ఉండనున్నాయో చూడాలి. సరే, ఓసారి స్టాండర్డ్ మోడల్ iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z7 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z7 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z7 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. ఇది 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: iQOO Z7 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: ఈ ఫోన్ లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iQOO Z7 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z7 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleAadhaar కార్డ్ పోతే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి!
Next articleలాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.