2023 ఆరంభం నుంచి iQOO సంస్థ మాంచి జోష్ మీద ఉంది. ఇప్పటి వరకు ఐకూ నుంచి iQOO 11, iQOO Neo 7 ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ మరొక ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. iQOO Z6 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న iQOO Z7 సిరీస్ ని ఐకూ సంస్థ సోషల్ మీడియాలో టీజ్ చేసింది.
ఐకూ ఇండియా సీఈవో, నిపుణ్ మార్య iQOO Z7 సిరీస్ లాంచ్ ని ట్విట్టర్ ద్వారా టీజ్ చేశారు. మార్చి నెలలో iQOO Z7 సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. నిపుణ్ షేర్ చేసిన ఇమేజ్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. iQOO Z7 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం పదండి.
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO Z7 సిరీస్
Let the craZe begin!
Dropping another hint of the Zeisty ‘?’ coming your way. If you have already figured it out, drop your guess in the comments below. We will give a big shout-out to the correct responses. #FullyLoaded #iQOO #ComingSoon pic.twitter.com/45oJacOTWA— Nipun Marya (@nipunmarya) February 24, 2023
iQOO Z7 సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, iQOO Z7 పూర్తి సిరీస్ ని లాంచ్ చేస్తుందా? లేదా ఒకే డివైజ్ ని లాంచ్ చేస్తుందా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఐకూ ఇండియా సీఈవో నిపుణ్ మార్య iQOO Z7 డివైజ్ డిజైన్ ని రివీల్ చేశారు. ఇమేజ్ లో డివైజ్ ని చూస్తుంటే, ఫోన్ డిజైన్ Vivo T1x ని పోలి ఉన్నట్లు అనిపిస్తోంది. Vivo T1x గతేడాది భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ వర్టికల్ కెమెరా మాడ్యూల్ ని బ్యాక్ ప్యానెల్ పై కలిగి ఉంటుంది. ఫ్లాష్ తో పాటు ఫోటోగ్రఫీ హై డెఫినిషన్ అని టెక్ట్స్ రాసి ఉంది. అలాగే పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. బాటమ్ లో ఐకూ బ్రాండింగ్ కనిపిస్తోంది.
iQOO Z7 కి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియలేదు. Z సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా అమెజాన్ లో విక్రయించబడుతున్న కారణంగా, త్వరలో రాబోవు iQOO Z7 సిరీస్ కూడా అమెజాన్ ద్వారానే అమ్మకాలు జరుపుకోనుందని భావించవచ్చు.
iQOO Z7 సిరీస్ లో iQOO Z7 5G, iQOO Z7 Pro 5G డివైజెస్ లాంచ్ కానున్నాయని గత నివేదికలు స్పష్టం చేసాయి. iQOO Z7 5G ఫోన్ I2207 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ప్రో మోడల్ విషయానికి వస్తే, అది I2213 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ప్రస్తుతానికి iQOO Z7 సిరీస్ కి సంబంధించి తెలిసిన వివరాలు ఇంతే. త్వరలోనే ఐకూ కంపెనీ నుంచి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
