త్వరలో ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ఐకూ సంస్థ సిద్ధమవుతోంది. iQOO Z7x 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లీకైన రిపోర్ట్స్ నిజమైతే, ఐకూ ఫోన్ ఏప్రిల్ నెలలో భారత్ లో లాంచ్ అవ్వనుంది. అయితే, లాంచ్ కంటే ముందు ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. కానీ, ఈ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు రాలేదు.
iQOO Z7x 5G గీక్ బెంచ్ లిస్టింగ్
గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా iQOO Z7x 5G డివైజ్ Vivo I2216 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 905 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 2137 పాయింట్లు నమోదు చేసింది. ఫోన్ మోడల్ నంబర్ ని గమనిస్తే, అది ఇండియన్ వేరియంట్ అని అర్థమవుతోంది. దీంతో iQOO Z7x 5G ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవ్వడం ఖాయమని అర్థం చేసుకోవచ్చు.
iQOO Z7x 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ఇతర వేరియంట్స్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ గీక్ బెంచ్ పై కేవలం 8జిబి ర్యామ్ తో మాత్రమే కనిపిస్తోంది.
iQOO Z7x 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
iQOO Z7x 5G స్మార్ట్ ఫోన్ లో 6.65-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Z7x 5G లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుందని అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
iQOO Z7x 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుండటం విశేషం. ఇక చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
