Home News 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన iQOO Z7x

6000ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైన iQOO Z7x

Highlights
  • చైనాలో లాంచైన iQOO Z7x స్మార్ట్ ఫోన్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చిన డివైజ్
  • మూడు మెమొరీ వేరియంట్స్ లో మార్కెట్ లోకి వచ్చిన ఐకూ జెడ్7ఎక్స్

ఐకూ సంస్థ తన హోమ్ మార్కెట్ చైనాలో కొన్ని రోజుల క్రితం iQOO Z7i స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో వచ్చింది. తాజాగా ఈ సంస్థ iQOO Z7 మరియు iQOO Z7x అనే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. iQOO Z7x డివైజ్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచైంది.

iQOO Z7x ధర

iQOO Z7x స్మార్ట్ ఫోన్ చైనాలో మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, మరొక వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, టాప్ మోడల్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో వచ్చాయి. 6జిబి ర్యామ్ వేరియంట్ ధర 1299 యువాన్లు (సుమారు రూ.15,600) గా ఉంది. 8జిబి+128జిబి మోడల్ ధర 1399 యువాన్లు (సుమారు రూ.16,800) గా ఉంది. 8జిబి+256జిబి యూనిట్ ధర 1499 యువాన్లు (సుమారు రూ.18,000) గా ఉంది.

iQOO Z7x స్పెసిఫికేషన్స్

iQOO Z7x లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి. పంచ్-హోల్ డిజైన్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంది.

iQOO Z7x స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ తో లాంచైంది. ఇకపోతే ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో 619 జీపీయూ అందించారు.

iQOO Z7x డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

పవర్ బ్యాకప్ కోసం iQOO Z7x లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.