లాంచ్ కి ముందు లీకైన iQOO Z8 పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights

  • సెప్టెంబర్ లో లాంచ్ కానున్న iQOO Z8
  • తాజాగా లీకైన iQOO Z8 స్పెసిఫికేషన్స్
  • ఆగస్టు 31 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Z7 Pro 5G

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO Z7 Pro 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఆగస్టు 31 న ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. ఈలోపు ఐకూ సంస్థ, చైనాలో iQOO Z8 సిరీస్ ని లాంచ్ చేసే పనిలో నిమగ్నమైంది. లైనప్ లో iQOO Z8 మరియు iQOO Z8x ఫోన్లు రానున్నాయి. తాజాగా వీబో పోస్ట్ ద్వారా ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ iQOO Z8 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది.

టిప్‌స్టర్ ప్రకారం, iQOO Z8 డివైజ్ 6.64-ఇంచ్ ఫ్లాట్ ఎల్సీడీ ప్యానెల్ తో రానుంది. ఇంకా ఈ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని సమాచారం. సరే, ఓసారి iQOO Z8 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Z8 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z8 స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫ్లాట్ ఎల్సీడీ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • ర్యామ్: iQOO Z8 రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి + 256జిబి స్టోరేజీ మోడల్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: iQOO Z8 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: iQOO Z8 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • చార్జింగ్: iQOO Z8 స్మార్ట్ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 0 నుంచి 100 శాతం వరకు చార్జింగ్ అయ్యేందుకు కొన్ని నిమిషాల సమయమే పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • బ్యాటరీ: iQOO Z8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు.
Previous articleఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Realme GT 5
Next articleiPhone లాంటి డిజైన్‌తో రానున్న Samsung Galaxy S24, S24 Plus
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.