
Vivo సబ్-బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Z8 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో iQOO Z8 మరియు iQOO Z8x డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 31 వ తేదీన ఈ రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. లాంచ్ సమాచారంతో పాటు, కంపెనీ నుంచి ప్రాసెసర్ కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
iQOO Z8, iQOO Z8x లాంచ్ తేదీ
iQOO కంపెనీ తన కొత్త ఫోన్లకు సంబంధించి ఒక టీజర్ ని రివీల్ చేసింది. ఈ టీజర్ లో లాంచ్ తేదీ ఆగస్టు 31 అని పేర్కొనబడి ఉంది. లాంచ్ సమయం గురించి మాట్లాడితే, చైనాలో ఆగస్టు 31 న రాత్రి 7 గంటలకు లాంచ్ ఉంటుంది. iQOO Z8 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇది 5 నానోమీటర్ ప్రాసెసర్ తయారైన చిప్.
iQOO Z8 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO Z8 లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎమ్‌సీ6 జీపీయూ వినియోగించారు.
- స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
- కెమెరా: iQOO Z8 లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందిస్తున్నారు.
- బ్యాటరీ: iQOO Z8 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: iQOO Z8 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
iQOO Z8x స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: iQOO Z8x లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Z8x లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఇవ్వనున్నారు.
- స్టోరేజీ: iQOO Z8x డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: iQOO Z8x లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: iQOO Z8x లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: iQOO Z8x డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











