Home News iQOO: వచ్చే నెలలో లాంచ్ అవుతోన్న iQOO Z9 5G

iQOO: వచ్చే నెలలో లాంచ్ అవుతోన్న iQOO Z9 5G

Highlights
  • iQOO Z9 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోన్న డివైజ్
  • మార్చి 12న లాంచ్ అవుతోన్న iQOO Z9 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో Z9 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ తాజాగా ఖరారైంది. మార్చి 12న iQOO Z9 5G ఇండియాలో లాంచ్ అవుతోంది. దీంతో ఐకూ లవర్స్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకూ ఇండియా సోషల్ మీడియా చానల్స్ ద్వారా iQOO Z9 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

వారం క్రితం ఐకూ సంస్థ, iQOO Z9 5G యొక్క టీజర్ ని వదిలింది. దీని ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తోంది.

iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ సెన్సర్ ఉంటుంది. సెగ్మెంట్ లో ఈ సెన్సర్ తో వస్తోన్న మొదటి ఐకూ ఫోన్ iQOO Z9 5G అని కంపెనీ చెబుతోంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)